కోహ్లీకి మాజీ గర్ల్ఫ్రెండ్ అభినందనలు! | Anushka Sharma congratulates ex- Virat Kohli on India's win over Pakistan | Sakshi
Sakshi News home page

కోహ్లీకి మాజీ గర్ల్ఫ్రెండ్ అభినందనలు!

Mar 20 2016 3:05 PM | Updated on Mar 23 2019 8:00 PM

కోహ్లీకి మాజీ గర్ల్ఫ్రెండ్ అభినందనలు! - Sakshi

కోహ్లీకి మాజీ గర్ల్ఫ్రెండ్ అభినందనలు!

భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం అనుష్క శర్మ అభినందనలు తెలిపినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

న్యూ ఢిల్లీ: భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం అనుష్క శర్మ అభినందనలు తెలిపినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. గత కొంత కాలంగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ అభినందనలు.. ఈ జంట మళ్లీ ఒక్కటవ్వడానికి దోహదం చేస్తాయని అభిమానుల్లో ఆశలు రేపుతున్నాయి.

శనివారం జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే కోహ్లి ఈ మ్యాచ్లో భారత్ను ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ అర్థసెంచరీ సాధించాడు. కోహ్లీ అద్భుత ప్రదర్శనకు ఫిదా అయిన అనుష్క శర్మ అతనికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో గ్యాలరీలో అనుష్క శర్మ చేసిన సందడి.. కోహ్లీ ఫ్లైయింగ్ కిస్లు మళ్లీ పునరావృతమవుతాయేమో వేచి చూడాలి మరి!
 

Advertisement
 
Advertisement
Advertisement