అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట ఓటమి | anirudh and vighnesh pair defeated | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట ఓటమి

Sep 22 2017 12:34 PM | Updated on Sep 22 2017 12:44 PM

అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట ఓటమి

అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట ఓటమి

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌ జంట సెమీస్‌లో ఓటమి పాలైంది.

 

గురువారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో అనిరుధ్‌ – విఘ్నేశ్‌ (భారత్‌) జంట 4–6, 6–7 (2/7)తో అర్జున్‌–శశి కుమార్‌ ముకుంద్‌ (భారత్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీస్‌ మ్యాచ్‌లో కాజా వినాయక్‌ శర్మ (ఏపీ)–మోహిత్‌ మయూర్‌ జయప్రకాశ్‌ (భారత్‌) ద్వయం 2–6, 2–6తో టాప్‌ సీడ్‌ చంద్రిల్‌ సూద్‌–లక్షిత్‌ సూద్‌ (భారత్‌) జంట చేతిలో ఓడిపోయింది.   

 

Advertisement
 
Advertisement
Advertisement