పోరాడి ఓడిన అనిరుధ్‌ జోడీ  | Anirudh Chandrasekar defeat in the mens doubles in French Open 2026 | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన అనిరుధ్‌ జోడీ 

May 29 2026 5:06 AM | Updated on May 29 2026 5:06 AM

Anirudh Chandrasekar defeat in the mens doubles in French Open 2026

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నిలో చివరి నిమిషంలో ఆడే అవకాశం లభించిన హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గురువారం పారిస్‌లో జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అనిరుధ్‌ (భారత్‌)–టకెరు యుజుకి (జపాన్‌) ద్వయం 3–6, 7–6 (7/4), 6–7 (3/10)తో జేకబ్‌ పాల్‌ (స్విట్జర్లాండ్‌)–మార్కస్‌ విలిస్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అనిరుధ్‌–టకెరు జోడీకి 19,000 యూరోలు (రూ. 21 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–జపాన్‌ జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 27 ఏళ్ల అనిరుధ్‌ ప్రస్తుతం ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 93వ స్థానంలో ఉన్నాడు. కెరీర్‌లో అతను నాలుగోసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నిలో బరిలోకి దిగాడు. 2024, 2025లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ని్రష్కమించిన అనిరుద్‌... 2025 యూఎస్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి పాల్గొన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement