ఆనంద్‌కు తొమ్మిదో స్థానం | Anand to the ninth position | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొమ్మిదో స్థానం

Sep 3 2015 12:43 AM | Updated on Sep 3 2017 8:37 AM

సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో .....

సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో స్థానం లభించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆనంద్ వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశాడు.

చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ఆడిన ఆనంద్ 36 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఆనంద్ 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా) విజేతగా అవతరించగా... ఐదు పాయింట్లతో కార్ల్‌సన్ రన్నరప్‌గా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement