మళ్లీ బ్యాట్‌ పట్టిన పుజారా... | After Three Months Cheteshwar Pujara Back To Game | Sakshi
Sakshi News home page

మళ్లీ బ్యాట్‌ పట్టిన పుజారా...

Jun 23 2020 12:01 AM | Updated on Jun 23 2020 12:01 AM

After Three Months Cheteshwar Pujara Back To Game - Sakshi

న్యూఢిల్లీ: మూడు నెలల విరామం అనంతరం భారత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారా మళ్లీ బ్యాట్‌ పట్టాడు. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో.... రాజ్‌కోట్‌లోని తన క్రికెట్‌ అకాడమీలో రంజీ జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పుజారా... గత ఏడాది తన జట్టుకు తొలి రంజీ టైటిల్‌ను అందించడంలో కీలకపాత్ర  పోషించాడు. రంజీ ఫైనల్‌ అనంతరం పుజారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. తను ప్రాక్టీస్‌ చేసే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పుజారా ‘నేనొచ్చేశా... చాలా కాలం దూరంగా ఉన్నట్లు అనిపించింది... అయితే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక నిన్ననే ప్రాక్టీస్‌ చేసినట్లు అనిపించింది’ అంటూ దానికి కామెంట్‌ జత చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement