పట్టు బిగించిన ఇంగ్లండ్‌ | 5th Test Day 3 England Finish Day With 382 Run Lead | Sakshi
Sakshi News home page

పట్టు బిగించిన ఇంగ్లండ్‌

Sep 15 2019 5:21 AM | Updated on Sep 15 2019 5:21 AM

5th Test Day 3 England Finish Day With 382 Run Lead - Sakshi

లండన్‌: ఓపెనర్‌ జాన్‌ డెన్లీ (94), ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ (67) అర్ధశతకాలకు తోడు బట్లర్‌ (47) రాణించడంతో యాషెస్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 9/0తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 383 పరుగుల ఆధిక్యంలో ఉంది. లయన్‌ (3/65) మినహా మూడో రోజు ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. సెంచరీ చేజార్చుకున్న డెన్లీ... స్టోక్స్‌తో మూడో వికెట్‌కు విలువైన 127 పరుగులు జోడించాడు. చివర్లో పుంజుకొన్న ఆసీస్‌ వరుసగా వికెట్లు తీసినా అప్పటికే ఆలస్యమైపోయింది. రెండు రోజుల ఆట ఉన్నప్పటికీ దాదాపు 400 పరుగుల ఛేదన ఆసీస్‌కు చాలా కష్టమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement