అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

KTR Funny Reply To His Fan Over FaceApp Photo - Sakshi

సోషల్‌ మీడియాలో ఫేస్‌యాప్‌ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. భద్రత సంగతి ఎలా ఉన్నా నెటిజన్లు మాత్రం ఈ యాప్‌ను విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకు ఈ యాప్‌ ద్వారా.. తాము ముసలివాళ్లమైతే ఎలా ఉంటామో చూసుకుంటూ సంబరపడిపోతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫొటోను ఓ అభిమాని  ఫేస్‌యాప్‌ ద్వారా ఎడిట్‌ చేశారు. ‘అన్నా.. మీరు గడ్డంతో చాలా హ్యాండ్సమ్‌గా కనబడుతున్నార’ని కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌.. ఆ ఫొటోపై సరదాగా స్పందించారు. ఆ అభిమానికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌.. నాట్‌ బ్యాడ్‌ అంటూ చమత్కరించారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top