మృత్యుంజయుడు! | Mrutyunjayudu! | Sakshi
Sakshi News home page

మృత్యుంజయుడు!

Jan 22 2018 1:52 AM | Updated on Oct 1 2018 6:22 PM

Mrutyunjayudu! - Sakshi

నర్సాపూర్‌రూరల్‌ : పాడుబడిన బావిలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. కాగజ్‌మద్దూరు గ్రామంలో ఆదివారం పాడుబడిన బావి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో  అటుగా వెళ్తున్న గ్రామస్తులు తొంగి చూశా రు. పాడుబడిన బావిలో గాజుపెంకులు, చెత్తాచెదారం మధ్యలో శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..8 మీట ర్ల లోతులో ఉన్న శిశువును క్షేమంగా పైకి తీసుకొచ్చి నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. కాలుకు చిన్న గాయం తప్ప ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించారు.

పుట్టిన మరుక్షణమే శిశువును బావిలో పడివేసి ఉంటారని వైద్యు లు భావిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి లోని చైల్డ్‌వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్‌ చెప్పారు.  నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్‌ నేత సునీతారెడ్డి.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిశువుకు ‘మృత్యుం జయుడు’అనే పేరు పెట్టించాలన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement