చంద్రబాబుకు మైనార్టీలపై ఎంత ప్రేమంటే..! | YSRCP mla Musthafa Shaik criticises AP cm Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మైనార్టీలపై ఎంత ప్రేమంటే..!

Feb 23 2018 5:11 PM | Updated on May 29 2018 4:40 PM

YSRCP mla Musthafa Shaik criticises AP cm Chandrababu - Sakshi

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు రాగానే మైనార్టీల జపం చేసే వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్ అన్నారు. మైనార్టీలకు చంద్రబాబు చేస్తున్న
మోసాలపై ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముస్లింల ద్రోహి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా అవకాశం ఇవ్వకపోవడం మైనార్టీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమను బహిర్గతం చేసిందన్నారు.

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలంతా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ముస్లింలకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు మైనార్టీలు గుర్తొస్తారని, ఎన్నికలు ముగిసేవరకు మైనార్టీల జపం చేస్తారని ఎమ్మెల్యే ముస్తఫా ఎద్దేశా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement