రాజధానిని తరలిస్తున్నామని ఎవరు చెప్పారు? | YSRCP MLA Adeep Raj Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజధానిని తరలిస్తున్నామని ఎవరు చెప్పారు?

Jan 13 2020 8:01 PM | Updated on Jan 13 2020 8:35 PM

YSRCP MLA Adeep Raj Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. సొంత లాభం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత లాభం కోసం అమాయకపు రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిడ్డారు. రాజధానిని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కావాలనే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు.

తన బినామీల భూముల రేట్లు తగ్గిపోతాయనే చంద్రబాబు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. తన స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భిక్షాటన దేని కోసమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు సతీమణి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు జోలె పట్టని చంద్రబాబు.. ఇప్పుడు భిక్షాటన చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు రెఫరెండం కావాలంటే విశాఖపట్నం నుంచే మొదలుపెడదాం అన్నారు. విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement