ప్రతి అడుగులో మీ ఆప్యాయత కనిపిస్తోంది | ys jagan tweet on his 1000km praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులో మీ ఆప్యాయత కనిపిస్తోంది

Jan 30 2018 12:19 PM | Updated on Jul 6 2018 2:54 PM

ys jagan tweet on his 1000km praja sankalpa yatra - Sakshi

నెల్లూరు జిల్లా సైదాపురంలో విజయసంకల్ప స్థూపం వద్ద వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘‘నేను వేసే ప్రతి అడుగులో మీ ఆప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు.. నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి’’ అని వెయ్యి కి.మీ. పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement