ఆరోగ్యశ్రీ కావాలంటే.. ‘రావాలి జగన్‌’

YS Jagan Promise On Aarogyasri - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సర్వేలన్నీ వైఎస్సార్‌ సీపీకే అనుకూలంగా వస్తున్నాయి. టీడీపీ నుంచి నాయకులు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏంచేయాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలుపోవడం లేదు. ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలుగు తమ్ముళ్లకు పూరమాయించారు. అంతేకాదు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన హామీలను నిసిగ్గుగా కాపీ కొట్టేస్తున్నారు. ‘నవరత్నాల’ను హడావుడిగా అమలు చేయడం మొదలుపెట్టారు. పింఛన్‌ పెంపు, పొదుపు సంఘాల రుణమాఫీ హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు విశ్వసించరని వైఎస్సార్‌ సీపీ దీమాగా ఉంది.

చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న రాజన్న తనయుడి మాటతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరిస్తామని, తాను కూడా చికిత్స కోసం అక్కడికే వెళ్లేలా గవర్నమెంట్‌ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తానని జగన్‌ చెప్పిన మాటను జనం పూర్తిగా విశ్వసిస్తున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితం​గా వైద్యం అందిస్తామన్న వైఎస్‌ జగన్‌ హామీ పేదల పాలిట ఆశాదీపంలా మారింది. అన్ని రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని వాగ్ధానం చేసిన జననేత ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంలోనే అద్భుతమైన పథకంగా ప్రపంచ బ్యాంక్‌ నీరాజనాలు అందుకున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏపీలో ఆస్పత్రులను అభివృద్ధి చేయకుండానే హైదరాబాద్‌లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వ విధించిన ఆంక్షలు పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో తరచుగా ప్రైవేటు ఆస్పత్రులు నిరసనలకు దిగుతుండటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం దక్కాటంటే ‘రావాలి జగన్‌’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top