ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం.. | Vijaya Sai Reddy Slams chandrababu Naidu And Lokesh | Sakshi
Sakshi News home page

‘ఎల్లో’ మీడియా ఇక జాగారం చేయాల్సిందే : విజయసాయిరెడ్డి

Apr 18 2020 3:24 PM | Updated on Apr 18 2020 3:54 PM

Vijaya Sai Reddy Slams chandrababu Naidu And Lokesh - Sakshi

సందు దొరకలేదు కానీ ఆ ఐడియా నేనే ఇచ్చేనని డబ్బు వాయించుకునేవాడు

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు సందు దొరకలేదు కానీ.. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తీసుకొచ్చే ఐడియా తానే ఇచ్చానని డబ్బు వాయించుకునేవాడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం వరస ట్వీట్లు చేశారు. ‘దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. ‘ఎల్లో వైరస్’ ఇక జాగారం చేయాల్సిందే. దేశంలో జగన్ గారిలా చొరవ చూపిన రాష్ట్రం ఇంకేదైనా ఉంటే ఎల్లో మీడియా చెప్పాలి. సందు దొరకలేదు కాని ఈ ఐడియా ఇచ్చింది నేనే అని డప్పు వాయించుకునేవాడు విజనరీ!’  అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు
(చదవండి: ‘చంద్రబాబు తెలంగాణ ప్రతిపక్ష నాయకుడా?’)

‘కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్‌డౌన్‌ను పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌కు  స్కేట్‌బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్!’ అని విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 
(చదవండి : ‘మనవడితో ఆడుకోక.. ఈ  చిటికెలెందుకు?’)

‘ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం జివోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదట. పిటీషన్లు వేయిస్తాడు. ఎగువ కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేయడం అమానుషం అంటాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల రక్తం తాగావు. పేద పిల్లలు నీ మనవడిలా చదువుకోవద్దంటావు. వాళ్లేం పాపం చేశారు బాబూ?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement