చంద్రబాబు ఎందుకు వణికి పోతున్నారు? | Vijaya Sai Reddy Satirical Tweets on Nara Lokesh | Sakshi
Sakshi News home page

పప్పునాయుడు.. డేటా దొంగను ఎందుకు దాచాల్సి వచ్చింది?

Mar 9 2019 10:34 AM | Updated on Mar 9 2019 3:03 PM

Vijaya Sai Reddy Satirical Tweets on Nara Lokesh - Sakshi

రెండు సిట్లు వేశారుగా ఎందుకు వణికి పోతున్నారు.. చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌ : డేటా స్కాం వ్యవహారంలో తమ తప్పేం లేదని ప్రగల్భాలు పలుకుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్‌లు ఐటీగ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా తండ్రి, కొడుకులపై ధ్వజమెత్తారు. మూలాలపై దెబ్బ కొడతా, తోకలు కత్తిరిస్తానని బెదిరించేది చంద్రబాబేనని, మళ్లీ తనను భయపెడుతున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెట్టేది కూడా ఆయనేన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. రెండు నాల్కలు ఉన్న వ్యక్తి ఒక్కో దానితో ఒక్కో మాట పలికినట్టుందని, అయినా రెండు సిట్లు వేశారుగా ఎందుకు వణికి పోతున్నారని ప్రశ్నించారు.

ఐటి గ్రిడ్స్‌పై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి పప్పు నాయుడు (నారాలోకేష్‌) తలుపు వెనక దాక్కుని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై ట్వీట్లు చేయిస్తున్నాడని, డేటా దొంగ అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో మాత్రం చెప్పడం లేదన్నారు. అదేదో బయటకొచ్చి చెబ్తే వినాలని ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక డేటా స్కాం మీద ప్రెస్ మీట్ పెట్టటం కూడా చేతగాని దద్దమ్మను ఐటీ  మినిస్టరుగా పెట్టుకుని, కులగజ్జి సన్నాసితో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొరిగించే  స్థితికి టీడీపీ దిగజారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేబినెట్ అంతా కలిసి ఎందులో అయినా దూకితే మేలని మండిపడ్డారు.

టీడీపీ కాల్ సెంటర్లలో 3,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు బోగస్ ఓట్లు ఎక్కించడం ప్రతిపక్షాల అనుకూల ఓట్లు తొలగించడం మీద పనిచేస్తున్నారని ఆరోపించారు. మరి జయభేరి, నారాయణ కాలేజీల్లో ఉన్నవారు అదనమని, వీళ్ల పనేమిటని ప్రశ్నించారు. సేకరించిన సమాచారాన్ని ఏం మానిప్యులేట్ చేస్తున్నారని నిలదీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement