బాబు వాడకం ఎలా ఉంటుందంటే..! | Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter | Sakshi
Sakshi News home page

బాబు వాడకం ఎలా ఉంటుందంటే..!

May 17 2020 3:21 PM | Updated on May 17 2020 3:28 PM

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు కురిపించారు. 'బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్‌లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చదవండి: తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?

కాగా మరో ట్వీట్‌లో.. 'పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం పట్టుకుంది బాబుకు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట. రాజధానిలో పేదలకు పట్టాలివ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం ఉత్సాహం నింపిందని అంటున్నారు' అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: 'ఎల్లో ఛానల్స్‌లో చూసుకున్నాకే నిద్రపోతాడు'

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement