ఓడినంత మాత్రాన రాజీనామా చేయాలా?

Uddhav Thackeray Takes A Dig At Rahul Gandhi Without Mentioning  Name  - Sakshi

ముంబై: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాజీనామాపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పరోక్షంగా స్పందించారు. ‘ఎన్నికల్లో అటల్‌ బిహారి వాజ్‌పేయితో పాటు మహామహులైన చాలామంది రాజకీయ నేతలు ఓడిపోయారు. కానీ, వారు ఎన్నడూ మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని’ పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇటివలే రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సబర్బన్ బోరివాలిలోని ‘అటల్‌ స్మృతి ఉద్యాన్‌’ ప్రారంభోత్సవ వేడుకలో గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఠాక్రే పాల్గొన్నారు. ఎన్నికల్లో స్వతహాగా ఒక్కసారి కూడా పోటీ చేయని ఠాక్రే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివసేన, దాని మిత్రపక్షమైన బీజేపీ అనేకసార్లు ఎన్నికల్లో ఓడిపోయాయని, కానీ తమ నాయకులు ఎన్నడూ నిష్క్రమించలేదన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top