చంద్రబాబు పచ్చి మోసకారి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే | TRS MLA Nomula Narsimhaiah Slams On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు పచ్చి మోసకారి: ఎమ్మెల్యే నోముల

Mar 5 2019 8:56 AM | Updated on Mar 5 2019 9:38 AM

TRS MLA Nomula Narsimhaiah Slams On Chandrababu Naidu - Sakshi

రెంటచింతల (మాచర్ల): ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి మోసకారి అని, ఆయన వాగ్దానాలను మళ్ళీ నమ్మి మోసపోవద్దని నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్దనున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవస్ధానంలోని స్వామివారికి ఆయన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ..నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి, తన స్వప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌తో కలిపి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేంద్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement