ఆ నలుగురిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు | TRS Complaint To Swamy Goud Over Party Change MLCs | Sakshi
Sakshi News home page

Dec 17 2018 11:53 AM | Updated on Dec 17 2018 11:58 AM

TRS Complaint To Swamy Goud Over Party Change MLCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సోమవారం మండలి చైర్మన్‌ను స్వామిగౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్‌, కొండా మురళిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై వేటు వేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌ నాయకులు చైర్మన్‌కు నేడు విజ్ఞప్తి చేశారు. స్వామి గౌడ్‌ను కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పొతూరి సుధాకర్‌ రెడ్డి,  పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement