చెవిరెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ యత్నం | TDP Workers Tried To Attack On Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ యత్నం

Feb 4 2019 12:24 PM | Updated on Feb 4 2019 12:46 PM

TDP Workers Tried To Attack On Chevireddy Bhaskar Reddy - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్‌లో సోమవారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాభాసగా మారింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాకుండా చెవిరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు పచ్చ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే, పోలీసుల సాయంతో చెవిరెడ్డి ఈ దాడి నుంచి తప్పించుకున్నారు.

సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో పచ్చ పార్టీ నేతలు ఆదివారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్‌ ప్యాకెట్లతో దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement