ఎంపీడీఓపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం | TDP Leaders Angry On Mpdo | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

Apr 6 2018 1:58 PM | Updated on Aug 10 2018 8:42 PM

TDP Leaders Angry On Mpdo - Sakshi

ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నాయకులు

సాలూరురూరల్‌ (పాచిపెంట): పింఛన్ల మంజూరు విషయమై టీడీపీ నాయకులు ఎంపీడీఓ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సూచించిన వారికి పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు కాకపోవడంపై  నిలదీశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ సమక్షంలో గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఈ తతంగం చోటుచూసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం లేకుండా పింఛన్లు ఎలా మంజూరు చేస్తారని ఎంపీడీఓను టీడీపీ నాయకులు, ఏఎంసీ చైర్మన్‌ పిన్నింటి ఈశ్వరరావు, ముఖే సూర్యనారాయణ, తదితరులు ప్రశ్నించారు.

తాను నిబంధనల మేరకే పింఛన్లు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు శాంతించలేదు. మండలంలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, మీరు పెద్దగా  పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం మమ్మల్ని పట్టించుకోవడం లేదని భంజ్‌దేవ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు మంజూరు చేయించుకోలేకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగ్గలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో భంజ్‌దేవ్‌ కూడా ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement