టీడీపీ నిర్ణయాన్ని స్వాగతించిన మమత | Save The Country From Disaster Mamata Banerjee | Sakshi
Sakshi News home page

టీడీపీ నిర్ణయాన్ని స్వాగతించిన మమత

Mar 16 2018 2:15 PM | Updated on Jul 28 2018 3:41 PM

Save The Country From Disaster Mamata Banerjee  - Sakshi

కోల్‌కత్తా: దేశాన్నిబీజేపీ విపత్తు నుంచి కాపాడాలని తృణముల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావటాన్ని ఆమె స్వాగతించారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మమతా బెనర్జీ శుక్రవారం ట్విట్‌ చేశారు. దేశంలో ఉన్న దుర్మార్గపు పాలనకు, ఆర్ధిక సంక్షోభానికి, రాజకీయ అస్థిరతకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీయే వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement