టీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ: సర్వే | Sarve satyanarayana comments over trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ: సర్వే

Oct 21 2018 2:57 AM | Updated on Mar 18 2019 9:02 PM

Sarve satyanarayana comments over trs - Sakshi

రామాయంపేట (మెదక్‌): టీఆర్‌ఎస్‌ మునిగిపోతున్న నావలాంటిదని, ఆ పార్టీ రాష్ట్రంలో నాలుగైదు స్థానాలకు మించి గెలువలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో రాహుల్‌ గాంధీ సభకు వెళ్తూ మార్గమధ్యంలో రామాయంపేట వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంప మహేందర్, శ్రావణ్‌కుమార్, సేవాదళ్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు అమరసేనారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 101 స్థానాలను కైవసం చేసుకుంటుం దని, కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద న్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల్లో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుం దని, కేసీఆర్‌ కుటుంబం కమీషన్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement