అవే ఫలితాలు 2019లో పునరావృతం: జూపల్లి | The same results will be repeated in 2019: Jupally | Sakshi
Sakshi News home page

అవే ఫలితాలు 2019లో పునరావృతం: జూపల్లి

Jan 31 2018 7:45 PM | Updated on Mar 18 2019 9:02 PM

The same results will be repeated in 2019: Jupally - Sakshi

టీఆర్‌ఎస్‌ మంత్రులు జూపల్లి, కేటీఆర్‌, లక్ష్మారెడ్డి తదీతరులు

జోగులాంబ గద్వాల : గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలే 2019 ఎన్నికల్లో పునరావృతం అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..తెలంగాణా నేతలకు మంత్రి పదువులు ఇవ్వడం కూడా కేసీఆర్ ఉద్యమ ఫలితమేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గతంలో కుక్కకు బొక్కేసినట్టు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల ప్రారంభానికి తెలంగాణ ఉద్యమ సెగనే కారణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement