టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి | Revanth Reddy Fires On TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి

Jan 26 2020 4:40 AM | Updated on Jan 26 2020 4:40 AM

Revanth Reddy Fires On TRS Party - Sakshi

లక్డీకాపూల్‌: టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి అయితే బీజేపీ పరోక్ష భాగస్వామి అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో ఎటువంటి అవగాహన లేకుంటే ‘బంగారు కూలి’పేరిట చేసిన అవినీతి ఫైల్‌ను కేంద్రం ఎందుకు తొక్కిపెట్టిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలు తమను ఏ మాత్రం కృంగదీయవని, ప్రజల పక్షాన కాంగ్రెస్‌ తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలు బ్లాక్‌మెయిల్‌తో మొదలై బ్లాక్‌మనీతో ముగుస్తున్నాయని విమర్శించారు. సిరిసిల్లలో కేటీఆర్‌ను వ్యతిరేకిస్తూ 10 మంది, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ ఆరుగురు రెబల్స్‌ గెలిచారని, అయినా అక్కడ టీఆర్‌ఎస్‌ గెలిచినట్టు చెబుతున్నారని విమర్శించారు. కొంపల్లిలో ఎన్నికల నిర్వాహకులు గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు చూపించారని ఆరోపించారు. 25 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు 50 శాతం వార్డులు కూడా రాలేదన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లం ఘించిన మంత్రులపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఓడిపోతే పదవులుండవని మంత్రులను కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారని, ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్‌మెయిలింగ్‌ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement