9 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటేయండి | Sakshi
Sakshi News home page

9 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటేయండి

Published Tue, Jan 23 2018 4:11 PM

Revanth Reddy files complaint EC Against nine trs mlas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్లమెంటు సెక్రటరీలుగా పనిచేసిన ఆరుగురు ఎమ్మెల్యే లతోపాటు లాభదాయక పదవుల్లో పనిచేస్తున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కొడంగల్‌ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా కొన సాగితే, వారిపై అనర్హత వేటు వేయడాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఈసీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.

‘ఎమ్మె ల్యేలు వినయ్‌భాస్కర్, జలగం వెంక ట్రావు, వి. శ్రీనివాస్‌గౌడ్, వి. సతీశ్‌ కుమార్, గ్యాదరి కిశోర్‌ కుమార్, కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్‌ 29న జీఓ ఎంఎస్‌ 173 జారీ చేసింది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను హైకోర్టులో సవాల్‌ చేయగా 2015 మే 1న హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది.

ప్రభుత్వం నియమించినప్పటి నుంచి కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగా రు’అని రేవంత్‌రెడ్డి ఫిర్యాదులో వివరిం చారు. తెలంగాణ ప్రభుత్వం విధానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదా ఇచ్చి కొత్త పదవుల్లో నియమించిందన్నారు. 

Advertisement
Advertisement