బీజేపీ కణకణంలో ప్రజాస్వామ్యం: ప్రధాని మోదీ

PM Modi inaugurates BJP's new headquarters in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి అంశంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడమే బీజేపీ వ్యవహారశైలి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, సీనియర్‌ నేత  మురళీమనోహర్‌ జోషి, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ బీజేపీ కణకణంలో  ప్రజాస్వామ్యం ఉంది. కార్యకర్తల శ్రమ, ఆకాంక్షల ప్రతిబింబం ఈ కార్యాలయం’ అని అన్నారు. భారత్ లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదని, అనేక రాజకీయ పార్టీలతో మన ప్రజాస్వామ్యం పరిమళిస్తోందని అన్నారు. అమిత్ షా మాట్లాడుతూ.. జనసంఘ్ స్థాపన నాటినుంచి కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, 14 నెలల్లోనే అత్యాధునిక కార్యాలయం నిర్మించామని చెప్పారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టామని, అన్ని రాష్ట్రాల కార్యాలయాలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ జరిపే సౌకర్యం  అందుబాటులో ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం బీజేపీదేనని తెలిపారు. కార్యకర్తల త్యాగాల వల్లే బీజేపీ విజయాలు సాధించగలిగిందని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top