వైఎస్సార్‌సీపీకి కొత్త నియామకాలు | New appointments to YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి కొత్త నియామకాలు

Oct 13 2017 1:23 AM | Updated on Jul 25 2018 4:50 PM

New appointments to YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఇద్దరిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. కృష్ణా జిల్లాకు చెందిన పైలా సోమినాయుడు, ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమాను రాజశేఖర్‌లను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఖాదర్‌ బాషా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వి.ఖాదర్‌ బాషా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగానికి పది జిల్లాల్లో అధ్యక్షులను నియమించారు. వీరు కాక ఆయా జిల్లాల్లో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement