వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష ఉపనేతగా నందిగం సురేష్‌

Nandigam Suresh Named YSRCP Deputy Leader in Lok Sabha - Sakshi

పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా లావు శ్రీకృష్ణదేవరాయలు

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేతగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసిన నందిగం సురేష్‌.. టీడీపీ అభ్యర్థి మల్యాద్రి శ్రీరామ్‌పై 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top