వీధి రౌడీలు మీరా.. మేమా: ఆర్‌కే రోజా

MLA RK Roja Slams Chandrababu naidu Over His Vizag Visit - Sakshi

సాక్షి, చిత్తూరు : పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉందని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటనను ప్రజలు అడ్డుకుంటే.. ఆ నిందను ప్రభుత్వంపై నెట్టడం దారుణమన్నారు. దీనికి సంబంధించిన సంఘటనల వీడియోలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందులో ఎక్కడైనా తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నట్లు చూపిస్తే రాజీనామా చేయడానికి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించవద్దని హితవు పలికారు. బినామీల పేరు మీద కొన్న భూముల విలువ తగ్గిపోతుందని ప్రశాంతంగా ఉన్న అమరావతిని బాబు అగ్నిగుండంలా మార్చారని మండిపడ్డారు. (అందుకే ప్రజలు బాబును అడ్డుకున్నారు: గుడివాడ అమర్నాథ్‌)

చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 27 మంది లబ్ధిదారులకు రూ. 32 లక్షల 70 వేల రూపాయల చెక్కులను శుక్రవారం రోజా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా లోక్‌ష్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయనకు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ రైతు పాస్‌బుక్‌ కోసం లక్ష రూపాయలు ఇచ్చానని చెప్పడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసి, అభివృద్ధిని అడ్డుకుని, వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబు మళ్లీ ఆ ప్రాంతానికి వెళితే ఎలా స్వాగతిస్తారనే కామన్‌ సెన్స్‌ ఉందా అని ప్రశ్నించారు. (‘ఉమ్మేస్తారన్నా కూడా బాబుకు సిగ్గు లేదు’)

‘మాట మాటకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన గవర్నమెంట్‌లో ఎంత అవినీతి, ఎంత అరాచకం జరిగిందనేదానికి ఈ సంఘటన ఉదాహరణ. మీ  సామాజిక వర్గంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ.. అధికారులను భయభ్రాంతులకు గురిచేయిస్తున్నవీధి రౌడీలు మీరా.. మేమా !. ఆరోజు నన్ను నిర్బంధించి కాన్వాయ్‌లో ఎక్కడకు తీసుకు వెళ్లారో కూడా అంతు చిక్కకుండా చేసిన చంద్రబాబు ఈరోజు రాజ్యాంగం పట్ల నిబద్దత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది. అప్పుడు అవలంభించని చట్టాలు నేడు గుర్తొచ్చాయా’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

చదవండి : ‘ఆయన డైరెక్షన్‌లోనే ఆ దాడి జరిగింది’

చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్‌

ఆ విష సంస్కృతికి బీజం వేసింది టీడీపీనే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top