‘ఉమ్మేస్తారన్నా కూడా బాబుకు సిగ్గు లేదు’ | Vijayasai Reddy Tweet On Chandrababu Bus Tour | Sakshi
Sakshi News home page

ప్రజల నోటికాడి ముద్దను లాక్కుంటావా?: విజయసాయిరెడ్డి

Feb 28 2020 1:06 PM | Updated on Feb 28 2020 1:55 PM

Vijayasai Reddy Tweet On Chandrababu Bus Tour - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ప్రజలు ఉమ్మేస్తారన్నా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారని బాబుపై ఆక్రోశం వెల్లగక్కారు. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా.. ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా? అని మండిపడ్డారు.

మరో ట్వీట్‌లో ‘జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు, కాలేజీ విద్యార్థులకు రూ. 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన... విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్‌కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ! అని’ విజయసాయిరెడ్డి విమర్శించారు.(పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..)

‘ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు  చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా గురువారం చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీంతో వేల సంఖ్యలో విశాఖ విమానాశ్రయం వద్దకు చేరుకున్న ప్రజలు చంద్రబాబును అడ్డుకున్న విషయం తెలిసిందే. (ఉరిమిన ఉత్తరాంధ్ర)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement