మంత్రి జవహర్‌పై పెరుగుతున్న వ్యతిరేకత | Mala Community Fires On Minister Jawahar | Sakshi
Sakshi News home page

మంత్రి జవహర్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

Feb 14 2019 6:44 PM | Updated on Feb 14 2019 6:45 PM

Mala Community Fires On Minister Jawahar - Sakshi

రానున్న ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాల సామాజిక వర్గానికే టికెట్‌ కేటాయించాలంటూ..

సాక్షి, కొవ్వూరు/ పశ్చిమగోదావరి : మంత్రి జవహర్‌కు తన నియోజకవర్గంలో రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గ నాయకుల పట్ల జవహర్‌ అహంభావ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ టీడీపీ నేతలు గతంలో కొవ్వూరులో మరో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.

తాజాగా ఆయనకు మరోసారి నిరసన సెగ తగిలింది. మంత్రి జవహర్‌ మాలల పట్ల వివక్ష చూపుతున్నారంటూ మాల నాయకులు తాళ్లపూడిలో నిరసన చేపట్టారు. రానున్న ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాల సామాజిక వర్గానికే టికెట్‌ కేటాయించాలంటూ వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement