మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్‌ పోల్స్‌ | Maharashtra And Haryana Assembly Elections Exit Polls | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్‌ పోల్స్‌

Oct 21 2019 7:12 PM | Updated on Oct 21 2019 7:56 PM

Maharashtra And Haryana Assembly Elections Exit Polls - Sakshi

మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్‌ జరిగింది. కాగా పోలింగ్‌ అనంతరం విడులైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

సాక్షి, ముంబై :  చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్‌ జరిగింది. కాగా పోలింగ్‌ అనంతరం విడులైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కమలం వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (SSP) కూటమి తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. 

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెండోసారి విజయదుందుభి మోగించనున్నదని ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించింది. గతంలో కంటే కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్‌ కంటే ఎన్సీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని పేర్కొంది. బీజేపీకి గరిష్టంగా 124 స్థానాలు, శివసేన 70, కాంగ్రెస్‌ 40 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. టెమ్స్‌ నౌ సర్వే ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ 230, కాంగ్రెస్‌ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ ప్రకారం బీజేపీ 142, కాంగ్రెస్‌ 24 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 సర్వేప్రకారం.. బీజేపీ 243, కాంగ్రెస్‌ 41, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకోనుంది. ఏబీపీ న్యూ.సిఓటర్‌ ప్రకారం బీజేపీ 204, కాంగ్రెస్‌ 69, ఇతరులు 15 సీట్లను కైవసం చేసుకోనున్నారు. న్యూస్‌24 ప్రకారం.. బీజేపీ 230, కాంగ్రెస్‌ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement