టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది : కిషన్‌ రెడ్డి | Kishan Reddy Fires On TRS In Karimnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది : కిషన్‌ రెడ్డి

Sep 20 2019 8:19 PM | Updated on Sep 20 2019 8:21 PM

Kishan Reddy Fires On TRS In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని, పేద ప్రజలకు 5 లక్షల రూపాయల విలువ చేసే ‘ఆయుష్మాన్ భవ’ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని, కల్వకుంట్ల, ఓవైసి రెండు కుటుంబాలకు తెలంగాణను తాకట్టు పెట్టినట్లుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో రెండోసారి వరుసగా కాంగ్రెస్సేతర​​​​  ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రధాని కావడం నరేంద్ర మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు. కులం, మతం, కుటుంబం అంటూ  లేకుండా దేశం కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీనని తెలిపారు. ప్రధాని  పనితీరు, అభివృద్ధిని కాంక్షిస్తూ బిజేపిలో చేరేవారి  సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement