కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ తోక పార్టీ | KCR is meeting Congress allies | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ తోక పార్టీ

May 3 2018 3:23 AM | Updated on Mar 18 2019 9:02 PM

KCR is meeting Congress allies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ తోకపార్టీగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్న పార్టీ నేతలతో కేసీఆర్‌ భేటీలు నిర్వహిస్తూ బీజేపీని దెబ్బ తీసేందుకు నానాపాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ మళ్లీ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లా డారు. 

తెలంగాణలో బీజేపీ బలంగా మారబోతోందని బెంబేలెత్తుతున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌ అనుబంధ పార్టీ నాయకులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌ ఇదే తరహాలో హడావుడి చేసి సొంత రాష్ట్రంలో ఓడిపోక తప్పలేదని, ఇప్పుడు కేసీఆర్‌కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారని పేర్కొన్నారు. 5న  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని, కొందరు ప్రముఖులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement