breaking news
Dr. laxman
-
కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ తోక పార్టీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ తోకపార్టీగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్న పార్టీ నేతలతో కేసీఆర్ భేటీలు నిర్వహిస్తూ బీజేపీని దెబ్బ తీసేందుకు నానాపాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మళ్లీ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లా డారు. తెలంగాణలో బీజేపీ బలంగా మారబోతోందని బెంబేలెత్తుతున్న కేసీఆర్ కాంగ్రెస్ అనుబంధ పార్టీ నాయకులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ ఇదే తరహాలో హడావుడి చేసి సొంత రాష్ట్రంలో ఓడిపోక తప్పలేదని, ఇప్పుడు కేసీఆర్‌కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారని పేర్కొన్నారు. 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని, కొందరు ప్రముఖులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. -
రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి:బీజేపీ
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్) ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. రైతుల రుణమాఫీపై ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన వైఖరి తెలపాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశానికి సంబంధించి కేసీఆర్ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ ను నిలదీస్తామన్నారు. ప్రభుత్వ అమలు చేసే హామీలపై తమ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుణమాఫీపై మాట తప్పితే మాత్రం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సోమవారం ఉదయం సర్దార్ పటేల్, అమర వీరుల స్థూపాలకు నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.