వాళ్లని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్‌కే: బండి సంజయ్‌

KarimNagar BJP MP Bandi sanjay Comments on CAA - Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: సీఏఏను వ్యతిరేకించేవాళ‍్లంతా దేశ ద్రోహులేనని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పౌర సత్వ సవరణ చట్ట వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాకిస్థాన్‌కి పంపిస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద సీఏఏకు మద్దతుగా జాతీయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభలో ఎంపీ సంజయ్‌ మాట్లాడుతూ...‘పచ్చ జెండాలతో ర్యాలీ తీసి ఈ ఓరుగల్లు గడ్డను అపవిత్రం చేశారు. మళ్లీ ఈ గడ్డను పవిత్రం చేయడానికే ఈ కాషాయం ర్యాలీ.

వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మూర్ఖపు పార్టీల వల్లే ఈ ఆందోళనలు. సీసీఏ ఎవరికీ వ్యతిరేకం కాదు. పక్క దేశాలలో ఉన్న హిందూ శరణార్ధులు భారత భూభాగంలో నివసిస్తామంటే వారికి పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చాం. మహాత్మగాంధీ, నెహ్రులు చెప్పిన విధివిధానాలనే ఈ సీఏఏ చట్టంలో పొందుపరిచాం. 370 ఆర్టికల్‌, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు జరగలేదు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో విచ్ఛిన్నం సృష్టించాలని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చూస్తున్నారు. పార్లమెంట్‌లో పూర్తి చర్చ జరిగిన తర్వాతే ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇస్లామిక్‌ దేశాల నుంచి వస్తున్న పైసలతో ఈ ఉద్యమాలు చేస్తున్నారు. మీరు రాళ్లు వేస్తే..మేము బాంబులు వేస్తాం.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ లుంబినీ పార్కులో బాంబులు వేసిన వారికి పౌరసత్వం ఇవ్వాలా... సమాధానం చెప్పాలి? కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని తిరుపతికి వచ్చి మొక‍్కారు. ఇక ఎంఐఎం నేత పది నిమిషాల్లో హిందువులను ఖతం చేస్తానని చెప్పినప్పుడు ఎక్కడిపోయాడు కేసీఆర్‌. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్‌ నిజమైన హిందువు అని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఒవైసీ సోదరులు, కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న కుట్రలు ఇక తెలంగాణలో సాగవు. మున్సిపాలిటీ ఎన్నికట్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే’ అని వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు..

వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక

ఉనికి లేని వారేపోరాటాలుచేస్తున్నారు

ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 10 మహా తిరంగా ర్యాలీ

దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ

అల్లర్లకు కాంగ్రెస్, ఆప్లే కారణం

పౌరసత్వ చట్టానికి వక్రభాష్యాలేల?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top