దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ

CAA-NPR-NRC is sinister plan to divide country - Sakshi

కాంగ్రెస్‌ నేత చిదంబరం

న్యూఢిల్లీ: జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ) అమలు చేయాలనే నిర్ణయం దేశాన్ని విభజించాలనే దుష్ట ఆలోచనలో భాగమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం దుయ్యబట్టారు. హిందూ రాష్ట్ర విభజన ఎజెండాను ముందుకు తీసుకురావాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ ప్రణాళికలో భాగంగానే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌ల అమలు నిర్ణయమని ఆరోపించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే వారు భారత ముస్లింలు మాత్రమేనని అన్నారు. వేరే మతాలను ఎన్నార్సీ కింద మినహాయించి సీఏఏలో చేర్చారని, అయితే ఎన్నార్సీ కింద అక్రమ వలసదారులుగా గుర్తించే ముస్లింలను మాత్రం సీఏఏ నుంచి మినహాయించారని విమర్శించారు. దీంతో భారతీయ ముస్లింలలో భయం, ఆందోళన నెలకొని ఉన్నాయని అన్నారు. ఎన్పీఆర్‌–2010కి ఎన్పీఆర్‌–2020కి అసలు పొంతనే లేదని, దీనిని వ్యతిరేకించాలని వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top