సుహాసినికి ఎన్టీఆర్‌ ఝలక్‌ | Jr NTR Skips Kukatpally Election Campaign | Sakshi
Sakshi News home page

Dec 1 2018 2:36 PM | Updated on Dec 1 2018 4:01 PM

Jr NTR Skips Kukatpally Election Campaign - Sakshi

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి సుహాసినికి హీరో ఎన్టీఆర్‌ ఝలక్‌ ఇచ్చారు.

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి సుహాసినికి హీరో ఎన్టీఆర్‌ ఝలక్‌ ఇచ్చారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కూకట్‌పల్లిలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావించారు. తన అక్క సుహాసిని గెలిపించాలని ఇంతకుముందు ట్విటర్‌ ద్వారా కోరారు. మరోవైపు ఆమె తరపున ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే హీరో కళ్యాణ్‌రామ్‌ ప్రచారం చేస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు.

ప్రజా కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె తరపున ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఎన్నికల ప్రచారానికి వస్తారని అంతకుముందు మీడియాలో వార్తలు వచ్చాయి. తన అన్న కుమార్తెకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ రోడ్‌ షోలు నిర్వహించనున్నారని సమాచారం. (మా అక్కను గెలిపించండి : ఎన్టీఆర్‌)

Advertisement
 
Advertisement
Advertisement