రాజస్తాన్‌ కాంగ్రెస్‌దే!

India Today analysis on Assembly elections of Rajasthan - Sakshi

అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే విశ్లేషణ

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు  ఇండియాటుడే  సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం 35% ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 43%, ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని 39% కోరుకున్నారు. 18% తమకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రిత్వం కోసం అశోక్‌ గెహ్లాట్‌(కాంగ్రెస్‌)కు 35%, వసుంధర రాజె(బీజేపీ)కు 31%, సచిన్‌ పైలట్‌(కాంగ్రెస్‌)కు 11% మద్దతిచ్చారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్ల పరిధిలో 10,136 మందిని  సర్వేలో భాగంగా సంప్రదించారు. అత్యధికులు ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధానిగా మోదీపై మాత్రం సానుకూలత వ్యక్తమైంది. ‘కాంగ్రెస్‌ సునాయాసంగా విజయం సాధిస్తుంది. దళితులు, ముస్లింలలో బీజేపీపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కంచుకోటల్లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ పట్టు కోల్పోతోంది’ అని విశ్లేషకులు అంటున్నారు.  
 
మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు ఉంది. బీజేపీ ప్రభుత్వం నిలుపుకునే అవకాశం 52% ఉందని సర్వే పేర్కొంది. ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక కారణంగా బీజేపీకి కొంత  ప్రయోజనం కలిగే అవకాశముందని తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని 42%, ప్రభుత్వం మారాలని 40% కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. 18% తెలియదంటూ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లోని 11,712 మంది నుంచి టెలిఫోన్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నిరుద్యోగం, వ్యవసాయరంగ సమస్యలు, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మారినట్టు తేలింది. జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ మరింత పుంజుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లలో జ్యోతిరాదిత్యకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు వెల్లడైంది. 

ఛత్తీస్‌గఢ్‌: మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని 43%, ప్రభుత్వం మారాలని 41%, తెలియదని 16% స్పందించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 55% ఉందని నిపుణుల సహకారంతో ఇండియా టుడే విశ్లేషించింది. అజిత్‌జోగి ‘జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌’పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్‌పీ, సీపీఐలతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  బీజేపీకి లాభిస్తుందని పేర్కొంది. ఈ కూటమి వల్ల కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమని విశ్లేషించింది. నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వెల్లడైంది. వరసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్నా, జనాదరణలో మాత్రం రమణ్‌సింగ్‌ ముందు వరసలోనే ఉన్నారు. సీఎంగా 44% రమణ్‌సింగ్‌కు, 23% కాంగ్రెస్‌ నేత భూపేష్‌ భాఘేల్,కు, 13% అజిత్‌ జోగికి మద్దతిచ్చారు. జోగి నేతృత్వంలోని కూటమికి 7% సానుకూలత చూపారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 4,486 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు

12-11-2018
Nov 12, 2018, 14:12 IST
బూర్గంపాడు: ‘ ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు దిగజారాయి. నాటికి నేటికి రాజకీయాల్లో ఎంతో వ్యత్యాసం వుంది. గిరిజనులకు రిజర్వ్‌ అయిన...
12-11-2018
Nov 12, 2018, 13:44 IST
మనపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయయ్యా? తొందరగా ఆ సీట్ల పంపకం ఏదో తేల్చండి
12-11-2018
Nov 12, 2018, 13:04 IST
సాక్షి, సిద్దిపేట :  ‘కేసీఆర్‌ బక్కపల్చగా ఉన్నాడంటున్నారు. ఈ కొస నుండి ఆ కొస వరకు వేలాది మంది జనం...
12-11-2018
Nov 12, 2018, 12:57 IST
మంథని‌: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సభ్యడు గోనె శ్రీనివాస్‌రావు ఆద్వర్యంలో మండలంలోని తాడిచర్ల గ్రామంలో...
12-11-2018
Nov 12, 2018, 12:52 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఎన్నికలు సమీస్తున్న త రుణంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు...
12-11-2018
Nov 12, 2018, 12:31 IST
మెట్‌పల్లి: వచ్చే ఎన్నికల్లో అన్ని కుల సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి...
12-11-2018
Nov 12, 2018, 12:18 IST
 సాక్షి, మక్తల్‌: పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ఇచ్చిన మాట నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వివిద...
12-11-2018
Nov 12, 2018, 11:58 IST
కోరుట్లటౌన్‌: రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు నష్టం ఖాయమని ఎంఐఎం కోరుట్ల అధ్యక్షుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రఫీయోద్దీన్‌...
12-11-2018
Nov 12, 2018, 11:47 IST
సాక్షి, వంగూరు: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ...
12-11-2018
Nov 12, 2018, 11:39 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌:  వరంగల్‌ కమిషనరేట్‌ను నేర రహితంగా  తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌...
12-11-2018
Nov 12, 2018, 11:35 IST
నర్సాపూర్‌నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు సీపీఐ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలుగా పోటీ...
12-11-2018
Nov 12, 2018, 11:22 IST
సాక్షి,సిటీబ్యూరో: ముందస్తు ఎన్నికల రణంతో గ్రేటర్‌ వేడెక్కనుంది. సోమవారం నోటిఫికేషన్‌ విడుదలతో పాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వారం...
12-11-2018
Nov 12, 2018, 11:22 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: తెలంగాణ జన సమితిలో రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌గా సేవలందించిన డాక్టర్‌ తిరుణహరి శేషు ఆ పార్టీకి రాజీనామా...
12-11-2018
Nov 12, 2018, 11:08 IST
సాక్షి, నర్సంపేట: నియోజవకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది...
12-11-2018
Nov 12, 2018, 10:59 IST
సాక్షి, మంగపేట: మీ కుంటుంబ ఆడబిడ్డగా ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే  ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి...
12-11-2018
Nov 12, 2018, 10:50 IST
సాక్షి, సిటీబ్యూరో: ఆయన ఓ సాధారణ ఆటోవాలా. ఆటో కార్మికుల అస్తిత్వానికి ప్రతీక. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెండున్నర...
12-11-2018
Nov 12, 2018, 10:48 IST
 సాక్షి, కొడకండ్ల: రాష్ట్ర అభివృద్ధి, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి పాలకుర్తి ప్రజలు...
12-11-2018
Nov 12, 2018, 10:44 IST
 సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా పాతబస్తీ నుంచి వేల సంఖ్యలో జనం...
12-11-2018
Nov 12, 2018, 10:42 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  రానున్న శానసనభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల అంశం తేలకముందే కొత్త డిమాండ్లు...
12-11-2018
Nov 12, 2018, 10:38 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: 1952 నాటి హైదరాబాద్‌ స్టేట్‌ మొదలుకుని 2014లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల వరకు...

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top