కాంగ్రెస్‌లోకి హార్దిక్‌ | Hardik Patel likely to Join Congress on March 12 | Sakshi
Sakshi News home page

మార్చి 12న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరిక

Mar 7 2019 9:03 AM | Updated on Mar 18 2019 7:55 PM

Hardik Patel likely to Join Congress on March 12 - Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌ : పటీదార్‌ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 12న కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారనే సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే హార్దిక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌ జామ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి హార్దిక్‌ పోటీ చేస్తారని ఆయన సన్నిహుతులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పుణమ్‌బన్‌ మాడమ్‌ బీజేపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

పటేల్‌ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ని ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులతో పబ్లిక్‌ ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పట్టు కోసం కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది.

(చదవండి : ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్‌)

Advertisement
 
Advertisement
Advertisement