ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్‌ 

Patidar leader Hardik Patel ends hunger strike after 19 days - Sakshi

19 రోజుల అనంతరం నిరశన దీక్ష విరమణ

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు, దేశద్రోహం కేసులో అరెస్టైన తన స్నేహితుడు అల్పేశ్‌ కత్రియా విడుదల డిమాండ్లతో పటేళ్ల నేత హార్దిక్‌ పటేల్‌ గత 19 రోజులుగా చేసిన నిరశన దీక్షను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఇక తదుపరి పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీలో చేస్తాననీ, జంతర్‌ మంతర్‌ లేదా రామ్‌ లీలా మైదానం వద్ద తాము నిరసనలకు దిగుతామని హార్దిక్‌ చెప్పారు.

మూడు డిమాండ్లతో అహ్మదాబాద్‌లోని తన ఇంట్లో గత నెల 25 నుంచి హార్దిక్‌ పటేల్‌ నిరవధిక నిరాహార దీక్షకు దిగడం తెలిసిందే. దీక్ష 14వ రోజున ఆరోగ్యం క్షీణించడంతో హార్దిక్‌ను వైద్యశాలకు తరలించగా రెండురోజులపాటు ఆసుపత్రిలోనే ఆయన దీక్ష కొనసాగించారు. పటేల్‌ సామాజిక వర్గ నేతలు నరేశ్‌ పటేల్, సీకే పటేల్‌లు బుధవారం హార్దిక్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హార్దిక్‌ మాట్లాడుతూ ‘ప్రజల సలహా మేరకు నేను నిరాహార దీక్షను విరమిస్తున్నాను. ముందు నేను బతికుంటేనే పోరాడగలను. పోరాడితేనే గెలుస్తాను’అని హార్దిక్‌ చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top