ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు: సీపీఐ | Fighting on anti-people policies | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు: సీపీఐ

Dec 22 2017 2:12 AM | Updated on Aug 10 2018 5:32 PM

Fighting on anti-people policies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సీపీఐ నిర్ణయించింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా గురువారం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు సహా వివిధ అంశాలపై చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని సీపీఐ ఆరోపించింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నిలబెట్టేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement