ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండకూడదు: సీపీఐ నారాయణ | Cpi Narayana Comments On Chandrababu And Br Naidu | Sakshi
Sakshi News home page

ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండకూడదు: సీపీఐ నారాయణ

Mar 22 2026 2:44 PM | Updated on Mar 22 2026 4:11 PM

Cpi Narayana Comments On Chandrababu And Br Naidu

సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్‌ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండకూడదంటూ మండిపడ్డారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్‌లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు.

..కోటి మంది భారతీయులు గల్ప్‌ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్‌కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు
 

Advertisement
 
Advertisement
Advertisement