‘ఉద్యోగాలా..పకోడీలా తేల్చుకోవాలి’ | Congress Tweets Today You Decide Jobs Over Pakoda | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాలా..పకోడీలా తేల్చుకోవాలి’

Apr 11 2019 11:32 AM | Updated on Apr 11 2019 11:38 AM

Congress Tweets Today You Decide Jobs Over Pakoda - Sakshi

 ఉద్యోగాలు కావాలా..పకోడాలు కావాలా తేల్చుకోవాలన్న కాంగ్రెస్‌

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ నేపథ్యంలో మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ గురువారం ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ‘ఈరోజు మీరు ప్రేమ కావాలా విద్వేషం కావాలా..? ఉద్యోగాలు కావాలా పకోడా కావాలా..? విధానాలు అవసరమా..ఉత్తుత్తి ఆర్భాటమా..? అనేది తేల్చుకోవాల’ని  ఓటర్లను కోరింది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మీకు మీరు ఓటు వేసుకున్నట్టే అని ఆ పార్టీ ట్వీట్‌ చేసింది.

మరోవైపు తొలిసారిగా ఓటర్లుగా నమోదైన యువత పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తి రికార్డు స్ధాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపు ఇస్తూ ట్వీట్‌ చేసింది. ఇక కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సైతం గురువారం ఉదయమే మోదీ సర్కార్‌పై ట్వీట్‌ దాడి చేపట్టారు. ‘దేశంలో మోదీ హామీ ఇచ్చిన మేరకు రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు...బ్యాంక్‌ ఖాతాల్లో రూ 15 లక్షలు వేయలేదు..మంచి రోజులు రానేలేదు..నోట్ల రద్దు, జీఎస్టీతో జనం వెన్నువిరిచార’ని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement