అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌  | Congress care of address is Corruption says Laxman | Sakshi
Sakshi News home page

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ 

Jan 1 2019 3:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress care of address is Corruption says Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అంటే కమీషన్‌– కరప్షన్‌– కలెక్షన్‌గా పేరుగాంచిందని, సోనియాగాంధీ, మన్మోహన్‌సిం గ్, రాహుల్‌ నేతృత్వం అంతా కుంభకోణాలమయమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.  ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ, ప్రజల రక్షణ పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని, వారి డీఎన్‌ఏలోనే దోపిడీ ఉందన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ స్కామ్‌ నిందితుడిని భారత ప్రభుత్వం ఇటీవల పట్టుకొని దేశానికి తీసుకొచ్చిందన్నారు.

అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ, సోనియా, రాహుల్‌ ఇతర నాయకులు బెంబేలెత్తిపోతున్నారన్నారు.  వారు ఊచలు లెక్కించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.  హెలికాప్టర్ల కొను గోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని మొదట ఇటలీ కోర్టు తెలిపిందని, ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఈ కేసులో కొంతమందిని అరెస్ట్‌ చేసిందన్నారు. ఇటలీ కోర్టులో పలుమార్లు సోనియా పేరు వచ్చిందని, నిందితుడు మిషల్‌ కూడా సోనియా పేరు ప్రస్తావించారని ఈడీ డిసెంబరు 29న పాటియాలా కోర్టుకు తెలిపిందన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement