రె‘బెల్స్‌’ మోగుతాయని..

Congress is afraid of defeat Where Muslims are affected areas - Sakshi

ముస్లింల ప్రభావమున్న చోట్ల కాంగ్రెస్‌కు ఓటమి భయం

రాజస్తాన్‌లో ముస్లింలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఉండొచ్చన్న అంచనాలు కాంగ్రెస్‌ను భయపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో రెబెల్స్‌, స్వతంత్ర అభ్యర్థులు కలిసి కాంగ్రెస్‌ కొంప ముంచారు. ఈ నియోజకవర్గాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులకు మధ్య ఓట్ల తేడా సదరు నియోజకవర్గంలో ఇతర ముస్లిం అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. అంటే సదరు రెబెల్స్‌ కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీశారనేది సుస్పష్టం. అయితే ముస్లిం పెద్దలు మాత్రం బలహీన అభ్యర్థులను నిలబెట్టినందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలయిందని విమర్శిస్తున్నారు.

2013లో కాంగ్రెస్‌ 16 నియోజకవర్గాల్లో ముస్లింలను నిలబెట్టింది. వీరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. కానీ అందరూ ఓడిపోయారు. ప్రస్తుతం రాజస్తాన్‌ అసెంబ్లీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అది కూడా బీజేపీ నుంచి గెలిచినవారే. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా తక్కువ మంది ముస్లింలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసినవాళ్లకు గుర్తింపు ఉండదని, చివరి నిమిషంలో ఎవరో వచ్చి టికెట్‌ తన్నుకుపోతారని టోన్‌ నియోజకవర్గంలో రెబెల్‌గా పోటీ చేసిన సౌద్‌ సైదీ విమర్శించారు. ఇలాంటి విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ అసంతృప్తులను చల్లబరిచేందుకు ఓ వేదికను ఏర్పాటుచేశారు. రాజస్తాన్‌లో దాదాపు 14 స్థానాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.  

బీజేపీ కారణమా? 
ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న స్థానాల్లో బీజేపీ కావాలని స్వతంత్ర ముస్లిం అభ్యర్థులను నియమిస్తోందని కాంగ్రెస్‌ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే కేవలం ఈ ఒక్క అంశమే తమ ఓటమికి కారణం కాదని పీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నిజామ్‌ ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులకు సీట్లివ్వడమే తమ కొంపముంచిందని ఆయన విశ్లేషిస్తున్నారు. రెబెల్స్, స్వతంత్రులు లేకుంటే ముస్లి ప్రాబల్యమున్న స్థానాలన్నీ తమ ఖాతాలోకే వచ్చేవని వాపోయారు.

అయితే కాంగ్రెస్‌ నిలబెట్టే అభ్యర్దులు బలహీనులు కావడం వల్లనే వారు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకుడు అష్ఫాక్‌ కాయంఖని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం బలమైన ముస్లిం లీడర్స్‌ ఎదగడాన్ని సహించదని, అందుకే కావాలని బలహీనులను బరిలోదింపి ఓడించిందని విమర్శించారు. జనాభాలో 12% ఉన్న ముస్లింల ప్రయోజనాలను కాపాడాలని, వారికి తగినన్ని సీట్లు కేటాయించాలని సెక్యులర్‌ పార్టీలకు రాజస్తాన్‌ ముస్లిం ఫోరం విజ్ఞప్తి చేసింది. గౌరవప్రదంగా చూడకుంటే ఇతర అవకాశాలను పరిశీలించడానికి ముస్లింలు వెనుకాడరని, ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడడాన్ని మానుకోవాలని ఫోరం కన్వీనర్‌ క్వారీ మొయినుద్దీన్‌ హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు

09-01-2019
Jan 09, 2019, 11:29 IST
కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసిందంటూ...
27-12-2018
Dec 27, 2018, 20:20 IST
ఆయన ఆస్తి విలువ రూ. 500 కోట్లు
27-12-2018
Dec 27, 2018, 03:03 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ...
25-12-2018
Dec 25, 2018, 17:59 IST
గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ రాజ్‌భవన్‌లో వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
25-12-2018
Dec 25, 2018, 05:29 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ...
24-12-2018
Dec 24, 2018, 17:23 IST
చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేననూ అసలే నమ్మొద్దని ప్రజలకు
22-12-2018
Dec 22, 2018, 12:24 IST
విలువలు పాటిస్తున్న నాయకుడిని కాబట్టే ..
22-12-2018
Dec 22, 2018, 11:02 IST
వరంగల్‌ స్థానిక సంస్థల ద్వారా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ..
21-12-2018
Dec 21, 2018, 01:49 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ శాసనమండలి...
21-12-2018
Dec 21, 2018, 01:26 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన టీఆర్‌ఎస్‌ తాజాగా శాసనమండలి ఎన్నికలపై దృష్టి సారించింది....
21-12-2018
Dec 21, 2018, 00:59 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను...
21-12-2018
Dec 21, 2018, 00:35 IST
హుజూరాబాద్‌: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్‌ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో...
21-12-2018
Dec 21, 2018, 00:16 IST
సాక్షి, జనగామ/హన్మకొండ: ‘జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల్లో ప్రజలు మనవైపే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో...
20-12-2018
Dec 20, 2018, 09:42 IST
సాక్షి, మంథని:  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. ప్రభుత్వ విప్‌.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న...
19-12-2018
Dec 19, 2018, 19:25 IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసినా బీజేపీకి కలిసిరాలేదు.
19-12-2018
Dec 19, 2018, 17:58 IST
వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తారు. పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసింది.
19-12-2018
Dec 19, 2018, 16:24 IST
రాబోయే మూడు ఏళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం ..
19-12-2018
Dec 19, 2018, 14:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గడిబిడి జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు....
19-12-2018
Dec 19, 2018, 12:57 IST
‘ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుందంటూ...
19-12-2018
Dec 19, 2018, 02:32 IST
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతంపై టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top