పవన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు | Chandrababu Naidu Interesting Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Jan 1 2019 8:38 PM | Updated on Mar 22 2019 5:33 PM

Chandrababu Naidu Interesting Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పవన్‌ కల్యాణ్‌తో కలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్‌ను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తెగ బాధపడిపోయారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేస్తారనే ప్రశ్నకు చంద్రబాబు నవ్వుతూ సమాధానం దాటవేశారు. పవన్‌తో కలిసి పోటీ చేయనని చంద్రబాబు చెప్పకపోవడం గమనార్హం.

పవన్‌తోనే తాము కలిసి ఉన్నామంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్‌తో టీడీపీ బంధం కొనసాగుతోందా? అనే సందేహాలు సామాన్య ప్రజలకు కలుగుతున్నాయి. టీడీపీ, జనసేనల మధ్య అంతర్గతంగా బంధం కొనసాగుతుందనే ఆరోపణలకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement