పంథా మార్చుకోని నారా లోకేశ్‌..

Cannot Win As Corporaters We Made Them MLAs And MLCs Says Lokesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తన సహజ ధోరణిని బయటపెట్టారు. ఇప్పటికే పలుమార్లు తన ప్రసంగాలతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా మహానాడులో సైతం తన బాణీని వదులుకోలేదు. తన పంథాను కొనసాగిస్తూ ప్రజలు కార్పోరేటర్లుగా కూడా తిరస్కరించిన నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ గెలిపించిందని చెప్పారు.

‘అంతెందుకు కార్పొరేటర్లుగా కూడా గెలవని వాళ్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది’ అంటూ మహానాడులో లోకేశ్‌ వ్యాఖ్యానించారు. దీంతో కార్పొరేటర్‌ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తిని ప్రజా సేవకుడిగా ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో నిలబెట్టామని లోకేశే ఆయన నోటితో చెప్పినట్లు అయింది. లోకేశ్‌ వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు సైతం నిశ్చేష్టులు అయ్యారు.

గతంలో దేశంలో తెలుగుదేశం పార్టీ అత్యంత అవినీతి పార్టీని అని లోకేశ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు మహానాడులో టీడీపీ నేతల వైఖరి మారలేదు. చివరిరోజు సమావేశాలు ఆత్మస్తుతి పరనింద సైతంగానే సాగాయి. ప్రతిపక్ష పార్టీ, బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు.

చంద్రబాబుకు భజన చేస్తూ తరించిన తమ్ముళ్లు నాయకత్వం దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. దీంతో కీలకమైన పార్టీ సమావేశం కాస్తా.. బుర్రకథలా మారిందని టీడీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది.

లోకేశ్‌ గత వ్యాఖ్యల కోసం.. కింది లింక్స్‌పై క్లిక్‌ చేయండి..

టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారు: లోకేశ్‌

మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్‌..

లోకేశ్‌.. మళ్లీ వేసేశారు!

అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్‌

నారా లోకేశ్ ప్రమాణం చూశారా?

తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేష్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top