‘కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రగ్రహణం వస్తుంది’ | BJP Leader Muralidhar Rao Fires On Congress And TRS | Sakshi
Sakshi News home page

Nov 12 2018 7:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

BJP Leader Muralidhar Rao Fires On Congress And TRS - Sakshi

సాక్షి, సిద్దిపేట : తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే తమ పార్టీని గెలిపించారలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన పార్టీ బూత్‌కమిటీ సమావేశంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, ఐదేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎక్కడ డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించలేదన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ తాగుబోతు తెలంగాణగా మర్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణలో చంద్రగ్రహణం వస్తుందన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని, కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదని గుర్తు చేశారు. ఈ సారి కాంగ్రెస్‌, టీడీపీని గెలిపిస్తే మళ్లీ టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారన్నారు. టీఆర్ఎస్‌ ఓటమి సిద్దిపేట నుంచే మొదలవుతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాయిని నరోత్తంరెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement