'బాబు ఆర్థిక లావాదేవీలన్ని శ్రీనివాస్‌కు తెలుసు'

BJP Leader Kosuru Venkat Fires On Chandrababu In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం అతన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరు వెంకట్‌ మండిపడ్డారు. ' 20 సంవత్సరాల నుంచి చంద్రబాబునాయుడు దగ్గర శ్రీనివాస్‌ పీఎస్‌గా పనిచేసిన సంగతి అందరికి తెలుసు. బాబుకు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలన్ని శ్రీనివాస్‌కు తెలుసు. శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడిపై బాబు ఎందుకు నోరు మెదపడం లేదు, బాబుతో పాటు లోకేష్‌పై కూడా ఐటీ విచారణ చేయాలి. చంద్రబాబును పచ్చమీడియా కాపాడే ప్రయత్నం చేస్తుందని, కేవలం రెండు లక్షల రూపాయల కోసం ఆరు రోజులు పాటు ఐటీ అధికారులు సోధాలు నిర్వహించరు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారంటూ' వెంకట్‌ ధ్వజమెత్తారు.

ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

ఐటీ దాడులపై నోరువిప్పని చంద్రబాబు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top